Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jul-2015 13:16:12
facebook Twitter Googleplus
Photo

చిరంజీవి 150వ సినిమాకి రంగం సిద్ధమవుతోందనే వార్త వెలువడిన దగ్గర నుంచి, ఈ సినిమాలో నటించే అవకాశం వస్తే వదులుకోనని చాలామంది చెబుతూ వచ్చారు. తాజాగా ఆ జాబితాలో నిన్నటి తరం కథానాయిక 'లిజీ' కూడా చేరిపోయింది. మలయాళ చిత్రసీమలో మమ్ముట్టి .. మోహన్ లాల్ .. సురేష్ గోపి వంటి అగ్ర కథానాయకులతో ఎన్నో సినిమాలు చేసిన లిజీ, తెలుగులోనూ ఆత్మబంధం .. 20వ శతాబ్దం వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది.

ఆ తరువాత ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ని పెళ్లిచేసుకుని చిత్రపరిశ్రమకి దూరమైన ఆమె, ఇకపై నటించాలనే నిర్ణయం తీసుకుంది. తెలుగు సినిమాలకి ప్రాముఖ్యతను ఇస్తాననీ .. ప్రాధాన్యత కలిగిన అమ్మ .. అత్త పాత్రలను పోషించాడనికి సిద్ధంగా వున్నానని చెబుతోంది. ఇటీవల 'శ్రీమంతుడు' సినిమాలో అవకాశం వస్తే అనుకోని కారణాల వలన చేయలేకపోయాననీ, ప్రతిష్ఠాత్మకమైన చిరంజీవి 150 సినిమాలో అవకాశం రావాలే గానీ, తప్పకుండా నటిస్తానని అంటోంది. మొత్తానికి గ్లామర్ తో కూడినటువంటి అత్త పాత్రలకి మరోనటి దొరికేసిందన్న మాట!

,  ,