Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-May-2017 15:57:46
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో రీఎంట్రీ కోసం లాంగ్ గ్యాప్ నే తీసుకున్నారు. రాజకీయాల్లోకి వెళ్లాక దాదాపు దశాబ్దం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. ఈ ఏడాదే ఖైదీ నంబర్ 150 మూవీతో తిరిగి మెగా కంబ్యాక్ ఇచ్చారు చిరు. ఇటు ఫిలిమ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన నెల రోజులకే.. బుల్లితెరపై అరంగేట్రం చేశారు మెగాస్టార్.

అయితే.. సినిమా మాదిరిగా టెలివిజన్ షో మీలో ఎవరు కోటీశ్వరుడు సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఆశించిన స్థాయి కంటే చాలా తక్కువగా ఈ షోకి రేటింగ్స్ వచ్చాయి. ఇప్పుడీ కార్యక్రమం ప్రస్తుత సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. వచ్చే నెలలో ఎంఈకే4కి ముగింపు పలకబోతున్నారు. క్లోజింగ్ సెలబ్రేషన్స్ బాగానే ప్లాన్ చేశారు కానీ.. ఆ తర్వాత ఎంఈకే సంగతేంటి అన్నదే పాయింట్. సహజంగా మీలో ఎవరు కోటీశ్వరుడు ఒక సిరీస్ పూర్తయ్యాక.. ఆరు నెలలు గ్యాప్ ఇచ్చి మళ్లీ షూటింగ్ చేయడం ఆనవాయితీ. కానీ ఈ సారి మాత్రం ఎక్కువ గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించారట. ఇందుకు చిరంజీవి కూడా కారణం అంటున్నారు.

త్వరలోనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీ ప్రారంభించనున్న ఆయన.. అది పూర్తయ్యాక నెక్ట్స్ సిరీస్ కి షూటింగ్ చేద్దామని చెప్పారట.

,  ,  ,  ,  ,  ,