Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Feb-2017 12:00:02
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ 150 సినిమాలు చేశారు. తన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150తో ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ సాధించారు మెగాస్టార్. ఇప్పుడు మెగాస్టార్ 150 సినిమాల సందర్భంగా.. ఓ సూపర్బ్ గేమ్ డిజైన్ చేశారు. మెగా 150 గేమ్ కు సంబంధించిన టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. 'లెజెండ్ లకే లెజెండ్ కు గ్రేట్ ట్రిబ్యూట్' అంటూ ప్రారంభించి.. మొదటగా మెగాస్టార్ ఘనకీర్తిని ప్రశంసించింది ఎం యాప్ సోర్స్ టీం.

టెంపుల్ రన్ మాదిరిగా డిజైన్ చేసిన గేమ్ లో మెగాస్టార్ చేసిన సినిమాలకు అనుగుణంగా కేరక్టర్ ను మార్చడం.. లొకేషన్స్ ఛేంజ్ చేయడం.. టార్గెట్ లను.. ఎదురయ్యే సవాళ్లను తీర్చిదిద్దడం బాగుందని చెప్పాలి. అడవి దొంగ.. ఖైదీ.. కొండవీటి దొంగ.. జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి సినిమాల్లోని గెటప్ లను లొకేషన్స్ ను గ్రాఫిక్స్ లో పక్కాగా ఉపయోగించుకున్నారు. ట్రైలర్ చివర్లో మెగా హీరోలందరినీ చూపించడం కూడా వాల్యూ ఎడిషన్ అని చెప్పాలి.

అయితే.. మెగా 150 గేమ్ ట్రైలర్ మధ్యలో ఇచ్చిన నేరేషన్ లో.. ఖైదీ నంబర్ 150తో.. 150వ చిత్రాన్ని చేరుకోబోతోన్న అని ఉండడం ఆశ్చర్యకరం. అంటే ఈ ట్రైలర్ డిజైనింగ్ ముందే ఖైదీ నంబర్ 150 రిలీజ్ కంటే ముందే జరిగిందన్న మాట. ఈఒక్క మిస్టేక్ ని కవర్ చేసుకుని ఉంటే బాగుండేది. మొత్తంగా మెగా 150 గేమ్ మాత్రం.. గేమింగ్ లవర్స్ ను ఆకట్టుకునేలా ఉంది.

,  ,  ,  ,  ,  ,  ,