Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Aug-2016 11:33:21
facebook Twitter Googleplus
Photo

యంగ్ హీరో ఆది తాను ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న విజయాన్ని చుట్టాలబ్బాయి చిత్రంతో అందుకుని ఖుషీ ఖుషీగా ఉన్నాడు. వీరభద్రం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు మిశ్రమ స్పందనను అందుకున్నప్పటికీ తరువాత మెల్లగా పుంజుకుని ఆది కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. శుక్రవారం రోజు 350 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి అదే రోజు నైజాం ఏరియాలో 20 థియేటర్లు పెంచారు.
మొత్తం మూడురోజుల్లో కలిపి దేశవ్యాప్తంగా రూ. 6 కోట్ల 30 లక్షలు వసూలు చేయడంతో తాజాగా ఈ చిత్రానికి సోమవారం మరో 100 థియేటర్లు పెంచారు. దీంతో ఈ చిత్రం లాంగ్ రాం లో మరింత కలెక్షన్లు రాబట్టే అవకాశముంది. పైగా వచ్చే వారం కూడా పెద్ద స్టార్ల సినిమాలేవీ లేకపోవడం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం దర్శకుడిగా వీరభద్రానికి కూడా మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి.

,  ,  ,  ,  ,  ,  ,