Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Feb-2016 17:30:31
facebook Twitter Googleplus
Photo

విన్నీ వియాన్, నేహ, హరిణి, ఆన్య హీరో హీరోయిన్లుగా నాయిని పృథ్వీ రెడ్డి సమర్పణలో శక్తి సినిమా బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ?దడ పుట్టిస్తా?. హర్రరర్ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కేశినేని శివనాథ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీమ్ వర్క్ పోస్టర్ ను తెలంగాణ హోం శాఖా మంత్రి నాయిని నరసింహారెడ్డి విడుదల చేశారు. అనంతరం ..తెలంగాణ హోం శాఖా మంత్రి నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ ??హర్రర్ చిత్రంగా కేశినేని శివనాథ్ నిర్మిస్తున్న చిత్రం దడ పుట్టిస్తా టీం వర్క్ పోస్టర్ ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. హర్రర్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ చిత్రంలో నటిస్తున్న విన్ని వియాన్, నేహ, హరిణి, ఆన్య సహా చిత్రంలోని ఇతర నటీనటులకు, టెక్నిషియన్స్ కు మంచి పేరు రావాలి. యూనిట్ కు ఆల్ ది బెస్ట్?? అన్నారు.

,  ,  ,  ,  ,