Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jun-2017 11:20:13
facebook Twitter Googleplus
Photo

బాహుబలి: ది కంక్లూజన్ వెయ్యి కోట్ల గ్రాస్ సాధిస్తుందన్నది అందరూ ఊహించిన విషయమే. ఐతే ఆ సినిమా అంచనాల్ని మించిపోయి రెండు వారాల్లోనే రూ.1500 కోట్ల మైలురాయికి చేరువై సంచలనం సృష్టించింది. మూడో వీకెండ్లో కూడా ఆ సినిమా జోరు చూసి ఫుల్ రన్లో రూ.2 వేల కోట్ల మైలురాయికి చేరువగా వెళ్తుందేమో అనుకున్నారు. కానీ తర్వాత ఈ సినిమా జోరు తగ్గింది. ప్రస్తుతం రూ.1650 కోట్ల దాకా ఉన్నాయి బాహుబలి-2 వసూళ్లు. ఫుల్ రన్లో రూ.1700 కోట్లకు చేరువగా వెళ్లొచ్చేమో. ఐతే రూ.2 వేల కోట్ల మైలురాయి బాహుబలి-2 కు అందుతుందా లేదా అన్నది ఆ చిత్రం చైనాలో ఎలా పెర్ఫామ్ చేస్తుందన్నదానిపై ఆధారపడి ఉంది. అక్కడ బాహుబలి-1 రూ.7 కోట్లు మాత్రమే వసూలు చేసిందన్న సంగతి తెలిసిందే.

ఐతే బాహుబలి-2 సంగతేమో కానీ.. అమీర్ సినిమా దంగల్ మాత్రం రూ.2 వేల కోట్ల మైలురాయిని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. చైనాలో వసూళ్ల ప్రభంజనం కొనసాగిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే అక్కడ రూ.1100 కోట్ల మార్కుకు చేరువగా వెళ్లింది. వరల్డ్ వైడ్ వసూళ్లు రూ.1850 కోట్లను దాటాయి. చైనాలో నెల రోజుల తర్వాత కూడా దంగల్ నిలకడగా వసూళ్లు సాధిస్తుండటం.. అక్కడ జులై 4 వరకు సినిమాను ప్రదర్శించుకునేందుకు నెల రోజుల అదనపు గడువు ఇవ్వడంతో దంగల్ రూ.2 వేల కోట్ల మైలురాయిని ఈజీగానే దాటేసే అవకాశముంది. చైనాలో హాలీవుడ్ సినిమాల వసూళ్లను కూడా దాటేసి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది దంగల్.

,  ,  ,  ,  ,