Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Oct-2015 15:18:16
facebook Twitter Googleplus
Photo

బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత ప్రభాస్ కెరీర్ ని డివైడ్ చేసి చూడాల్సొస్తోంది. బాహుబలి సాధించిన అసాధారణ విజయం అతడిని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. అందుకే ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రభాస్ తెలివిగా ఇప్పటికే బాలీవుడ్ నుంచి పీఆర్ కమ్యూనికేషన్ బాగా మెయింటెయిన్ చేస్తూ తనకి కావాల్సిన ప్రచారం చేసుకుంటున్నాడు. కార్పొరెట్ కంపెనీలతో వాణిజ్య ప్రకటనల ఒప్పందాలు మరోవైపు సినిమాలకు సంబంధించిన కమిట్ మెంట్లు ముంబై పీఆర్ విభాగం చూసుకుంటోంది. అయితే ఇటీవల ప్రభాస్ ధూమ్ 4లో విలన్ గా నటిస్తున్నాడు అన్న వార్త ల్లో ఏ నిజం లేదని తేలిపోయింది. బాలీవుడ్ మాటేమో గానీ.. బాహుబలి క్రేజు ప్రభాస్ కి కోలీవుడ్ లో అక్కరకొస్తోందిప్పుడు. బాహుబలి హవాని కోలీవుడ్ లో క్యాష్ చేసుకునేందుకు రాఘవ లారెన్స్ తెలివైన ప్రణాళికలు వేశాడు.

ప్రభాస్ నటించిన తెలుగు ఫ్లాపు సినిమా రెబల్ ని కోలీవుడ్ లో వీరబలి పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం అనువాదం పనుల్లో ఉన్నారు. రెబల్ ఓ మాస్ యాక్షన్ ఫిలిం. మూస పంథాలో పక్కా మాస్ ఆడియెన్ ని టార్గెట్ చేసి ఈ సినిమాని తెరకెక్కించినా మన జనాలకు ఎందుకనో ఎక్కలేదు. మరి తమిళ తంబీల్ని ఎంతవరకూ మెప్పిస్తుందో చూడాలి.

,  ,  ,