Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Jul-2017 11:07:19
facebook Twitter Googleplus
Photo

సినిమాకు అవసరానికి మించి పబ్లిసిటీ చేస్తున్నారంటే.. ప్రమోషన్ హడావుడి మరీ ఎక్కువైపోయిందంటే కంటెంట్ విషయంలో కొంచెం సందేహించాల్సిందే. వచ్చే శుక్రవారం రాబోతున్న దర్శకుడు సినిమా సంగతి చూస్తుంటే ఇలాంటి సందేహాలే కలుగుతున్నాయి. సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు మొదట్నుంచి ప్రమోషన్ హడావుడి బాగా ఎక్కువైపోయింది. ఫస్ట్ లుక్ లాంచ్ కు ఎన్టీఆర్ వచ్చాడు.. తర్వాత సమంత.. రకుల్ ప్రీత్ వచ్చి సింగిల్స్ ఆవిష్కరించారు. ఆపై రామ్ చరణ్ ఆడియో వేడుకకు అతిథిగా వచ్చాడు. ఇప్పుడు బన్నీని పిలిచి ప్రి రిలీజ్ ఈవెంట్ చేశారు. అన్నింట్లోనూ సినిమా గురించి అదే పనిగా ఊదరగొట్టేస్తున్నారు.

టీజర్.. ట్రైలర్ కట్ చేయడంలో సుకుమార్ హ్యాండ్ ఉన్నట్లుగా కనిపించింది. అవి పర్వాలేదనిపించాయి కానీ.. మరీ ప్రత్యేకంగా అయితే లేవు. కుమారి 21 ఎఫ్ కు రైటింగ్ పార్ట్ అంతా సుకుమారే చూసుకున్నాడు కాబట్టి ఆ సినిమా అంతటా సుక్కు ముద్ర కనిపించింది. ఒకరకంగా అది సుకుమార్ సినిమానే. కానీ దర్శకుడు లో సుక్కు పాత్ర ఏమీ లేదు. ఆయన ఈ సినిమాకు సమర్పకుడు.. అంతే. కథ.. స్క్రీన్ ప్లే.. మాటలు.. దర్శకత్వం అన్నీ సుక్కు మిత్రుడు హరిప్రసాదే చూసుకున్నాడు. సుక్కు ఫ్రెండయినంత మాత్రాన సుక్కు అంత టాలెంటెడే అని.. సినిమాను అద్భుతంగా తీసేసి ఉంటాడని అనుకోవడానికేమీ లేదు. పైగా అతను కొత్త దర్శకుడు. మరి దర్శకుడు ఎలా ఉంటుందో ఏమో అన్న సందేహాలు లేకపోలేదు. హీరో అశోక్ ను చూస్తే చాలా మామూలుగా కనిపిస్తున్నాడు. హీరోయిన్ ఈషా కూడా గ్లామర్ పరంగా మంచి మార్కులేమీ పడవు. ఈ నేపథ్యంలో దర్శకుడు మీద ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి చూపిస్తారో అన్న సందేహాలున్నాయి. పైగా ప్రచార హడావుడి ఎక్కువైపోయేసరికి జనాలకు సినిమాపై నెగెటివ్ ఫీలింగ్ పడిపోతోంది.

,  ,  ,  ,  ,