Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jan-2015 15:59:37
facebook Twitter Googleplus
Photo

ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం 'టెంపర్' ఆడియో వేడుకకు డేట్ ఫిక్స్ చేస్తున్నారు. ఈ నెల 18న ఈ వేడుకను హైదరాబాదులో ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంచితే, ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులోని పలు లొకేషన్లలో జరుగుతోంది. ఎన్టీఆర్, కాజల్ సహా పలువురు ప్రధాన పాత్రధారులపై ముఖ్య సన్నివేశాలను దర్శకుడు పూరీ జగన్నాథ్ చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ పోలీసాఫీసర్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

,  ,  ,  ,  ,