Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Feb-2015 11:35:31
facebook Twitter Googleplus
Photo

కమలహాసన్ తదుపరి చిత్రం విడుదలకు డేట్ ఫిక్సయింది. ఇప్పటికే ఆయన నటించిన 'విశ్వరూపం 2' చిత్రం విడుదలకు రెడీగా వుండగా, దానికంటే ముందుగా 'ఉత్తమవిలన్' చిత్రం రిలీజ్ కావడానికి సమాయత్తమవుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు లింగుసామి నిర్మించాడు. అయితే, ఈ చిత్రం ప్రదర్శన హక్కులను భారీ మొత్తం వెచ్చించి ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ చేజిక్కించుకుంది. దీంతో ఆ సంస్థ ఏప్రిల్ రెండున దీనిని విడుదల చేయడానికి ఏర్పాట్లు మొదలెట్టింది. అన్నట్టు, ఈ చిత్రంలో కమల్ ద్విపాత్రాభినయం చేశాడు. సినిమాకు అదొక ప్రత్యేక ఆకర్షణ అవుతుంది!

,  ,  ,  ,