Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Aug-2016 15:36:46
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషన్ అంటే పెళ్లి చూపులు సినిమానే చెప్పాలి. ఈ సినిమాలో భాగమైన ప్రతీ ఒక్కరికీ గుర్తింపు వచ్చిందంటే.. ఆడియన్స్ అందరినీ గుర్తు పెట్టేసుకున్నారంటే.. ఎంతగా ఈ మూవీ ప్రభావం చూపిందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండకు స్పెషల్ క్రేజ్ ను తెచ్చి పెట్టింది పెళ్లిచూపులు. ఈ హీరోను సెన్సేషనల్ లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లోకి తీసుకుంది.

నందినీ రెడ్డి తీయనున్న నెక్ట్స్ పిక్చర్ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్నాడు. ఇతనికి జంటగా మాళవికా నాయర్ యాక్ట్ చేయనుంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే.. వీళ్లిద్దరూ ఒకే మూవీతో పాపులర్ అయ్యారు. ఎవడే సుబ్రమణ్యం మూవీలో నాని హీరో కాగా.. హీరోయిన్ మాళవికా నాయర్. కీలక పాత్రలో విజయ్ కనిపిస్తాడు. ఈ మూవీనే వీళ్లిద్దరికీ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ నటించనుండడం.. అప్పుడు ఫ్రెండ్స్ కాగా.. ఇప్పుడు రొమాంటిక్ పెయిర్ గా యాక్ట్ చేయనుండడం విశేషమే.

అలా మొదలైందితో మొదలుపెట్టి.. మధ్యలో ఫ్లాప్ బాట పట్టిన నందినీ రెడ్డి.. రీసెంట్ గా కళ్యాణ వైభోగమే మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది. ఇప్పుడు ట్యాలెంటెడ్ యాక్టర్స్ ను పెయిర్ గా సెట్ చేసి.. ప్రాజెక్ట్ ప్రారంభంలోనే ఆసక్తి కలిగించేసిందీ లేడీ డైరెక్టర్.

,