సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ?తిక్క? సినిమాలో తమిళ స్టార్ హీరో ధనుష్ ఓ పాట పాడడం తాజాగా మంచి ఆసక్తి రేకెత్తించిన విషయం తెలిసిందే. గతంలో తన సినిమాలకే ఎక్కువగా సరదాగా పాటలు పాడిన ధనుష్, ఇలా ఓ తెలుగు హీరో కోసం పాట పాడడం ప్రత్యేకంగా నిలిచింది. థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోలో ధనుష్ పాడిన పాట మేజర్ హైలైట్గా నిలుస్తుందని సమాచారం. ఇక ఈ పాటను ధనుష్, కేవలం 30 నిమిషాల్లో పూర్తి చేశారట.
తిక్క బేబీ అంటూ సాగే ఈ పాట కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లూ చేసుకోగా, ధనుష్ అర్థగంటలో రికార్డు చేసేశారట. కొన్నేళ్ళ క్రితం ధనుష్ పాడిన ?కోలవెరి? డి అనే పాట తరహాలోనే తిక్క బేబీ కూడా హిపాప్ పాటగా ఉండనుందని తెలుస్తోంది. ఇక ?తిక్క? సినిమా విషయానికి వస్తే సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ను సి. రోహిణ్ రెడ్డి నిర్మించారు. ఆగష్టు 13న పెద్ద ఎత్తున విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఈనెల 30న విడుదల కానుంది.