Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Aug-2015 10:45:35
facebook Twitter Googleplus
Photo

గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్ అంటే విదేశీ నిపుణులు మాత్రమే చేయటం నిన్నటి మాట. అత్యద్భుతమైన గ్రాఫిక్స్ ను అందిస్తూ.. ఇప్పటికే హాలీవుడ్ లోనూ పలువురు భారతీయులు తమ సత్తా చాటిన విషయం తెలిసిందే.

తాజాగా విడుదలైన మిషన్ ఇంపాజిబుల్ సీరిస్ లో భాగమైన మిషన్ ఇంపాజిబుల్ రోగ్ నేషన్ కు ఒక పక్క ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టటంతో పాటు.. దీని విజువల్ ఎఫెక్ట్స్ కు మాంచి పేరు వస్తోంది. కళ్లు చెదిరే ఎఫెక్ట్స్ ను అందించిన క్రెడిట్ భారతీయులదేనని చెబుతున్నారు.

జులై 30న అమెరికాలో విడుదలై.. గురువారం స్పెషల్ షోలతో విడుదలైన మిషన్ ఇంపాజిబుల్ తాజా చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఈ సినిమాలో విజువుల్ ఎఫెక్ట్సే హైలెట్ గా చెబుతున్నారు. ఈ సినిమా గురించి న్యూయార్క్ టైమ్స్ లో రివ్యూ చేసిన ప్రముఖ విమర్శకుడు మనోహ్లా డర్గీస్ సైతం.. విజువల్ ఎఫెక్ట్స్ కు క్రెడిట్ ఇవ్వటం గమనార్హం.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ట్రామ్ క్రూయిజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ కు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ధీరేంద్ర ఛాట్ పర్.. ఇటీవల భారత్ లో విడుదలైన బాలీవుడ్ చిత్రం భజరంగీ భాయిజాన్ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అందించటం ఒక విశేషం. ఇటీవల విడుదలైన హమారి అధూరి కహాని.. తనూ వెడ్స్ మను చిత్రాలకూ ఆయనే విజువల్ ఎపెక్ట్స్ అందించారు.

ఇక.. మిషన్ ఇంపాజిబుల్ చిత్రానికి డిజిటల్ కంపోజిటర్లుగా పని చేసిన భారతీయులు సౌరభ్ నందేడ్కర్.. అభిషేక్ సింగ్ లు గతంలో విడుదలైన బాలీవుడ్ చిత్రాలు బర్ఫీ.. ఏబీసీడీ .. బాగ్ మిల్కా బాగ్లు సౌరభ్ చేస్తే.. దబాంగ్ 2.. హౌస్ పుల్ 2 చిత్రాలకు భట్టాచార్య పని చేశారు. మొత్తానికి బాలీవుడ్ లోనూ.. అటు హాలీవుడ్ లోనూ గ్రాఫిక్స్ తో దుమ్ము లేపుతున్న ఈ భారతీయులు రానున్న రోజుల్లో మరింత పేరు తెచ్చుకోవటమే కాదు.. భారత్ కీర్తిని ప్రపంచానికి చాటుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

,  ,  ,