Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Dec-2016 13:56:44
facebook Twitter Googleplus
Photo

రామ్ చరణ్ ధృవ కథ రెండో వారానికే ముగిసిపోతుందనుకున్నారు. కానీ మూడో వీకెండ్లోనూ ఈ సినిమా ఓ మోస్తరు వసూళ్లే రాబట్టింది. గత వారాంతంలో విడుదలైన సినిమాలేవీ కూడా అనుకున్న స్థాయిలో ప్రభావం చూపకపోవడం ధృవ కు బాగా కలిసొచ్చింది. దీంతో రూ.50 కోట్ల షేర్ మార్కు దగ్గరే ఆగిపోతుందనుకున్న ?ధృవ?.. రూ.53 కోట్లను దాటడమే కాదు.. ఇప్పటికీ సక్సెస్ ఫుల్ బాక్సాఫీస్ రన్ కొనసాగిస్తూ ఉంది.

?ధృవ? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా రూ.38 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. అత్యధికంగా నైజాం ఏరియాలో రూ.14 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసిందీ చిత్రం. ?ధృవ? బయ్యర్లలో ఇప్పటిదాకా లాభాల్లోకి వచ్చింది ఈ ఏరియాలోనే. ఈ సినిమాను నైజాం బయ్యర్ రూ.13.5 కోట్లకు కొన్నాడు. ఇక సీడెడ్లో రూ.9 కోట్లు పెట్టుబడి పెడితే.. ఇప్పటిదాకా రూ.6.23 కోట్ల షేర్ వచ్చింది. అక్కడ బ్రేక్ ఈవెన్ కు రావడం కష్టమే అన్నట్లుంది.

ఉత్తరాంధ్రలో రూ.5 కోట్లు.. తూర్పు గోదావరిలో రూ.2.92 కోట్లు.. పశ్చిమ గోదావరిలో రూ.2.56 కోట్లు.. కృష్ణాలో రూ.2.74 కోట్లు.. గుంటూరులో రూ.3.26 కోట్లు.. నెల్లూరులో రూ.1.24 కోట్లు వసూలయ్యాయి. ఇదీ 17 రోజుల్లో ?ధృవ? తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన కలెక్షన్లు. కర్ణాటకలో రూ.6.57 కోట్లు.. ఇండియాలోని మిగతా ఏరియాల్లో రూ.1.6 కోట్లు వసూలయ్యాయి. అమెరికాలో ఇప్పటిదాకా ఈ చిత్రం 1.35 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. ఈ వారం రాబోతున్న సినిమాల ఫలితాల్ని బట్టి ?ధృవ? బ్రేక్ ఈవెన్ కు (రూ.60 కోట్లు) ఎంత దూరంలో ఆగుతుందో తేలుతుంది.

,  ,  ,  ,