Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jun-2016 12:06:16
facebook Twitter Googleplus
Photo

దిల్ రాజు బేసిగ్గా డిస్ట్రిబ్యూటర్. అగ్ర నిర్మాతగా ఎదిగినా కూడా డిస్ట్రిబ్యూషన్ మాత్రం వదులుకోలేదాయన. చిన్న పెద్ద తేడా లేకుండా తెలివిగా సినిమాల్ని ఎంచుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా.. చాలా వరకూ డిస్ట్రిబ్యూటర్ గా మంచి ఫలితాలే అందుకుంటాడు రాజు. ఆయన రిస్క్ చేస్తాడు కానీ.. అవి క్యాల్కులేటెడ్ గా ఉంటాయి. గత ఏడాది బాహుబలి కోసం విపరీతమైన పోటీ నెలకొన్నప్పటికీ రికార్డు స్థాయిలో రూ.24 కోట్ల పెట్టుబడి పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు రాజు. కానీ ఆ సినిమా దానికి తగ్గట్లే భారీగా ఆదాయాన్నందించింది.

ఐతే ఈ సమ్మర్లో విడుదలైన రెండు భారీ సినిమాల హక్కుల కోసం కూడా రాజు పోటీలో నిలిచాడు. ఆ రెండూ సర్దార్ గబ్బర్ సింగ్.. బ్రహ్మోత్సవం. ఐతే ఈ రెండు సినిమాలకూ పోటీ తీవ్రమై రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. రెండు రూ.20 కోట్ల దాకా వెళ్లిపోయాయి. ఐతే బాహుబలి విషయంలో చేసిన రిస్క్ ఈ రెండు సినిమాల విషయంలో చేయలేదు రాజు. అవతలి వాళ్లు చాలా పెద్ద రిస్క్ చేశారు. దారుణమైన ఫలితాల్నందుకున్నారు. దిల్ రాజు తన జడ్జిమెంట్ స్కిల్స్ తో ఆ సినిమాల ఫలితాల్ని గెస్ చేసి తనకు తానుగా వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గాడా.. వేరే బయ్యర్లతో పోటీ పడలేక సైడైపోయాడా అన్నది తెలియదు కానీ.. మొత్తానికి రాజు రెండు పెద్ద ప్రమాదాల్నే తప్పించుకున్నాడు. మిగతా బయ్యర్లు కూడా పెద్ద సినిమాల హక్కుల కోసం వేలంవెర్రిగా ఎగబడ్డం మానుకుంటే మంచిదని సర్దార్.. బ్రహ్మోత్సవం ఫలితాలు చాటిచెప్పాయి.

,  ,  ,  ,  ,  ,