Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Nov-2016 11:19:40
facebook Twitter Googleplus
Photo

మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పుడు తనకు నచ్చిన ప్రతీ సినిమాను కొనేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన సినిమాను చూసిన తరువాతే అటువంటి డెసిషన్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన నైజాం ఏరియా వరకు కొనుక్కున్న ''సాహసం శ్వాసగా సాగిపో'' సినిమా నవంబర్ 11న రిలీజ్ అవుతున్న సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ విషయం రివీల్ చేశాడు ఆయను. పదండి చూద్దాం.

''నిజానికి మేం చైతన్యను జోష్ సినిమాతో లాంచ్ చేస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. జోష్ షూటింగ్ మద్యలో ఉన్నప్పుడు.. సార్ ఇంకో సినిమా కమిట్ అయ్యాను అంటూ చైతన్య చెప్పాడు. గౌతమ్ మీనన్ డైరక్షన్లో లవ్ స్టోరీ అన్నాడు. అదేంటి మన సినిమా శివ రేంజులో హిట్టయ్యి నువ్వు యాక్షన్ స్టార్ అయిపోతావ్.. ఈ లవ్ స్టోరీ ఎందుకు అని తిట్టాను. కాని రిజల్టు రివర్స్ అయ్యింది. అలాగే ఇప్పుడు కూడా సాహసం శ్వాసగా సాగిపో రిలీజ్ లేటైంది కాబట్టి.. ఏముంటుందిలే అనుకున్నాను. కాని మొన్న సినిమా చూసినప్పుడు షాకయ్యాను. ఏ మాయ చేశావే ఫస్ట్ హాఫ్ అయితే.. సెకండాఫ్ ఒక ఘర్షణ సినిమాలా ఉంది. నేను కాదు.. త్వరలో ప్రేక్షకులే ఆ విషయం చెబుతారు'' అంటూ చెప్పారు దిల్ రాజు.

ఇక దర్శకుడు గౌతమ్ మీనన్ కూడా.. ప్రేమమ్ సినిమా తరువాత అభిమానులకు నా తరుపునుండి నేను ఇంకో బ్లాక్ బస్టర్ ఇస్తున్నాను అంటున్నాడు. సినిమాలో లవ్ స్టోరీతో పాటు ఒక థ్రిల్లర్ ఉంది. ఏ మాయ చేశావే ఒక కుర్రాడి కథ అయితే.. అదే కుర్రాడు ఒక మగాడు అయ్యాక జరిగే కథే ఈ సినిమా అన్నాడు. నవంబర్ 11న సినిమా రిలీజవుతోంది.

,  ,  ,  ,  ,