Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Apr-2016 16:45:06
facebook Twitter Googleplus
Photo

మలయాళ సినీ నిర్మాత అజయ్ కృష్ణన్ ఆత్మహత్య వ్యవహారం సంచలనంగా మారింది. తను తీస్తున్న 'అవరాడే రవుకల్' మూవీ ప్రివ్యూని చూసిన తర్వాత.. నిరుత్సాహంతో ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో సినిమా యూనిట్ మొత్తం గందరగోళంలో పడిపోయింది.

అయితే అవరాడే రవుకల్ చిత్ర యూనిట్ చెబుతున్న వెర్షన్ మాత్రం వేరేగా ఉంది. ఆసిఫ్ ఆలీ - ఉన్నిముకుందన్ - అజు వర్ఘీస్ లు నటిస్తున్న ఈ చిత్రానికి షాహిల్ మొహమ్మద్ దర్శకుడు. 'ఇప్పుడు నేను ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. అజయ్ కి నాకు మంచి అనుబంధం ఉంది. తను చాలా సరదా మనిషి. సెట్స్ మొత్తం తిరిగేస్తూ.. ఎవరికేం అవసరమో తనే తెలుసుకుని మరీ తీర్చేస్తుంటాడు. అతనితో కానీ తన ప్రవర్తనతో కానీ ఒక్కరు కూడా నిరుత్సాహపడలేదంటే.. ఎంతటి మంచి మనిషో అర్ధమవుతుంది' అన్నాడు దర్శకుడు.

'అవరాడే రవుకల్ చిత్ర ప్రివ్యూను చూశాక ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ మూవీకి ఇంకా ఎడిటింగ్ - డబ్బింగ్ - బీజీఎం కూడా కంప్లీట్ కాలేదు. అలాంటిది ఆయన ప్రివ్యూ ఎలా చూడగలరు. పైగా ఇప్పటికే శాటిలైట్ - డిస్ట్రిబ్యూషన్ సహా అన్ని డీల్స్ కుదిరిపోయాయి. ఆర్థిక సమస్య అనే మాటేలేదు. అజయ్ ఆత్మహత్యకు కారణం ఏంటో మిస్టరీగా ఉంది' అంటూ వివరణ ఇచ్చాడు దర్శకుడు షానిల్.

,  ,  ,  ,  ,  ,  ,  ,