Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Mar-2017 16:25:34
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఏం జరుగుతోందనే విషయంపై అందరిలోనూ క్లారిటీ ఉంది. డీజే టీజర్ కు రికార్డు స్థాయిలో డిజ్ లైక్స్ పడ్డం వెనక పవన్ ఫ్యాన్స్ ఉన్నారనే విషయం సుస్పష్టం. అయితే.. ఇప్పుడు పవన్ కాటమరాయుడు రికార్డును బన్నీ డీజే తిరగరాసేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

పవన్ మూవీ మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుండగా.. బన్నీ సినిమా విడుదలయ్యేందుకు మరో 2 నెలలు పడుతుంది. మరి ఈ రెండింటికీ పోటీ ఏంటి.. రికార్డు తిరగరాయడం ఏంటనే డౌట్ సహజమే. అయితే.. ఇది యూట్యూబ్ లో టీజర్ వ్యూస్ రికార్డు గురించి. ఏ టీజర్ కి అయితే పవన్ ఫ్యాన్స్ పని కట్టుకుని డిజ్ లైక్స్ కొట్టారో.. అదే ఇప్పుడు కాటమరాయుడు టీజర్ రికార్డును బద్దలు కొట్టేసింది. యూట్యూబ్ లో మొదటిసారి 10 మిలియన్ల వ్యూస్ సాధించిన తెలుగు టీజర్ గా కాటమరాయుడు పేరిట రికార్డ్ ఉంది.

అయితే.. ఈ మార్క్ అందుకునేందుకు కాటమరాయుడు టీజర్ కు 37 రోజుల టైం పట్టింది. డీజే-దువ్వాడ జగన్నాధం కూడా కోటి వ్యూస్ మార్క్ ను అందుకుంది. ఈ మార్క్ చేరుకునేందుకు అల్లు అర్జున్ కి కేవలం 25 రోజులు మాత్రమే పట్టింది.

,  ,  ,  ,  ,  ,  ,