Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Feb-2017 13:41:05
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం అల్లు అర్జున్ కొత్త చిత్రం "డీజే" (దువ్వాడ జగన్నాథం) సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గబ్బర్ సింగ్ రీమేక్ చేసి తన సత్తా చాటుకున్న హరీష్... ఆ స్థాయిలో తరువాత చిత్రాల ద్వారా ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి. అయితే బన్నీతో డీజే ప్రకటించిన దగ్గర నుంచీ ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ ఖాయం అనే టాక్ ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ పాజిటివ్ టాక్ తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాలేదండోయ్! మన డీజే సౌండ్ బాలీవుడ్ కి కూడా అప్పుడే వినిపించేసింది!

ఒక సినిమా విడుదలై హిట్ అయిన తరువాత దాని రీమేక్ గురించి ఎవరైనా మాట్లాడతారు! కానీ బన్నీ డీజే విషయంలో పరిస్థితి మరోలా ఉందనిపిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి.. డీజే చిత్రంపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నాడు. సింగం చిత్రాన్ని అజయ్ దేవ్ గన్ తో రీమేక్ చేసి అక్కడ హిట్ కొట్టాడు. రోహిత్ సినిమాల్లో చాలా సన్నివేశాలు మన సినిమాలకు దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి. అతడి డైరెక్షన్ లో సౌత్ టచ్ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే గత కొన్నాళ్లుగా ఒక మాంచి కమర్షియల్ సబ్జెట్ కోసం రోహిత్ శెట్టి వెతుకుతున్నాడు. అతడి కన్ను తాజాగా మన డీజే మీద పడ్డట్టుంది!

ఇదే ఆసక్తితో డీజే సెట్స్ కి రోహిత్ శెట్టి వచ్చాడు. షూటింగ్ స్పాట్ కి వచ్చి దర్శకుడు హరీష్ శంకర్ తో చాలాసేపు ముచ్చటించాడు. డీజే ప్రోగ్రెస్ అడిగి తెలుసుకున్నాడు. మొత్తానికి ఏదో భారీ ప్లాన్ తోనే రోహిత్ వచ్చి ఉంటాడని అనుకుంటున్నారు! డీజే రీమేక్ కోసం ప్రయత్నిస్తున్నాడేమో..!

,  ,  ,  ,  ,  ,