Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jan-2017 10:41:48
facebook Twitter Googleplus
Photo

ఫస్ట్ వీకెండ్ అవ్వగానే సగం థియేటర్లు ఖాళీ అయిపోతాయి. రెండు మూడు వారాలు గడిస్తే సినిమా అడ్రస్ ఉండదు. గత కొన్నేళ్లుగా సినిమాల పరిస్థితి ఇది. టాక్ ఎలా ఉన్నా సంబంధం లేదు. ఎలాంటి సినిమాలకైనా లాంగ్ రన్ అన్నది కష్టంగానే ఉందిప్పుడు. సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడం.. వీలైనంత ఎక్కువ కలెక్షన్లు రాబట్టడం.. ఇదే ఇప్పటి ఫార్ములా. ఐతే ఇలాంటి రోజుల్లోనూ కొన్ని సినిమాలు లాంగ్ రన్ తో ఆశ్చర్యపరుస్తున్నాయి. నిఖిల్ సినిమా ?ఎక్కడికి పోతావు చిన్నవాడా? ఈ కోవకే చెందుతుంది. ఈ సినిమా ఈ రోజుల్లోనూ 28 థియేటర్లలో అర్ధశత దినోత్సవం పూర్తి చేసుకోవడం విశేషం. ఇవన్నీ జెన్యూన్ గా 50 కొట్టిన సెంటర్లే.

హైదరాబాద్.. విజయవాడ.. రాజమండ్రి సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. మొన్నటి వీకెండ్లోనూ ఈ సినిమాకు కొన్ని చోట్ల హౌస్ ఫుల్స్ పడటం విశేషం. ఈ రోజుల్లో ఇంత చిన్న సినిమా 28 థియేటర్లలో అర్ధశతదినోత్సవం పూర్తి చేసుకోవడం గొప్ప ఘనతగా భావించాలి. డీమానిటైజేషన్ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని.. జనాల్ని థియేటర్లకు రప్పించిన ఈ చిత్రం దాదాపు రూ.30 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసి నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ?ఎక్కడికి పోతావు చిన్నవాడా?లో నిఖిల్ సరసన హెబ్బా పటేల్.. నందిత శ్వేత కథానాయికలుగా నటించారు.

,  ,  ,  ,  ,  ,