Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Apr-2016 15:16:12
facebook Twitter Googleplus
Photo

విలక్షణ నటుడు మోహన్ బాబు.. ఎన్నో చిత్రాలతో తన నటనా ప్రతిభను చాటుకున్నారు. ఆయన నటించిన సినిమాల్లో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. మరి వాటన్నిటిలోంచి నచ్చిన ఐదు సినిమాల గురించి చెప్పమంటే.. అలా సెలక్ట్ చేయడం చాలా కష్టం అంటున్నాడు మంచు విష్ణు.

తండ్రి మోహన్ బాబు నటించిన సినిమాల్లో నుంచి రీమేక్ కి సెలక్ట్ చేసుకోవాలంటే.. మొదట అసెంబ్లీ రౌడీనే ఎంచుకుంటా అంటున్నాడు విష్ణు. డైలాగ్స్ తో మోహన్ బాబు ఏ రేంజ్ లో మేజిక్ చేయగలరో ప్రూవ్ చేసిందీ సినిమా అంటాడీ అబ్బాయి. సరైన డైరెక్టర్ దొరికితే రీమేక్ కి రెడీ అంటూ ఆఫర్ కూడా ఇచ్చేశాడు. ఇక ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని మూవీల్లో అల్లుడు గారు ఒకటి అన్నాడు మంచు విష్ణు.

పెదరాయుడుగా తండ్రి పోషించిన పాత్ర.. ఒకటే రోల్ మూడు కోణాల్లో సాగుతుందుని.. అసలు ఆ సినిమాలో మోహన్ బాబు కనిపించరని.. కేవలం పాత్ర మాత్రమే కనిపించే గొప్ప స్క్రిప్ట్ పెదరాయుడు అని చెప్పాడు మంచు విష్ణు. చిన్నప్పుడు బాగా ఎక్కువగా చూసిన సీతమ్మపెళ్లిని.. ఇప్పుడు చూసినా ఏడుపొచ్చేస్తుందంటున్నాడు. ఈమూవీ తర్వాత బాపు డైరెక్షన్ లో ఓ పాత్ర చేయాలని భావించాడట.

శ్రీరామరాజ్యంలో ఓ భటుడి పాత్ర ఇమ్మని అడిగాడట. అయితే.. బాపు దర్శకత్వంలో చేయాలన్న తన కోరిక మాత్రం తీరలేదని చెప్పాడు మంచు విష్ణు. ఇక నెగిటివ్ రోల్స్ లో అయితే రాయలసీమ రామన్న చౌదరి బాగా నచ్చిందిట మంచు విష్ణుకి. దేవుడిని ఆ పాత్ర ఎందుకు నమ్మదో చెప్పే సీన్ విపరీతంగా ఇష్టం అంటున్నాడు మంచు వారబ్బాయి. ఎప్పుడైనా పొగరు అహంకారంతో కూడా చేయాల్సిన పాత్ర వస్తే ఆ సినిమానే స్ఫూర్తిగా తీసుకుని చేస్తాడట.

,  ,  ,  ,  ,