Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Aug-2016 14:47:44
facebook Twitter Googleplus
Photo

ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు పీక్ స్టేజ్ లో ఉంది. గతేడాది వరకు టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ప్రభాస్ ఇమేజ్.. బాహుబలి రిలీజ్ తర్వాత ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదిగిపోయింది. దేశవ్యాప్తంగా అయితే.. ప్రభాస్ ఓ బ్రాండ్ అయిపోయాడు. ఇంతగా అందరినీ ఆకట్టుకోవడంలో.. ప్రభాస్ ఫిజిక్ ఫిట్నెస్ కీలకం అనే సంగతి స్పెషల్ గా చెప్పేసుకోవాలి.

ఫిట్నెస్ గురించి మాట్లాడుకోవాలంటే.. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ప్రభాస్ తర్వాతే ఎవరైనా. అంతగా తన దేహధారుడ్యాన్ని కాపాడుకుంటున్నాడు. బాహుబలి మూవీలో రెండు పాత్రల కోసం ప్రభాస్ పడుతున్న కష్టం ఏ రేంజ్ లో ఉందో జనాలు వింటూనే ఉన్నారు.. చూస్తూనే ఉన్నారు. అలాంటి రెబల్ స్టార్ క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు ఓ ఫిట్నెస్ బ్రాండ్ ప్రభాస్ ని అప్రోచ్ అయింది. తమ ప్రొడక్ట్స్ కి దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని కోరింది. ఇందుకోసం ఆఫర్ చేసిన మొత్తం ఎంతో తెలుసా? 5.5 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పింది ఆ కంపెనీ.

ఇంతటి ఆఫర్ వస్తే సాధారణంగా ఎవరైనా తలూపేస్తారు కానీ.. ప్రభాస్ మాత్రం సంథింగ్ సంథింగ్. అందుకే తను ఇప్పుడు బాహుబలి2 పై తప్ప మరే షూట్ పైనా దృష్టి పెట్టలేనని సున్నితంగా చెప్పి పంపించేశాడు. బాహుబలి ది కంక్లూజన్ టాప్ రేంజ్ కి చేరాలంటే ప్రభాస్ పై ఉన్న క్యూరియాసిటీ కంటిన్యూ అవుతూనే ఉండాలి. అందుకే ఇలా ఐదున్నర కోట్లు ఇంటికొస్తానంటే కాదు పొమ్మన్నాడు ప్రభాస్.

,  ,  ,  ,