Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Apr-2016 17:42:40
facebook Twitter Googleplus
Photo

వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా అనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ సినిమా సంగతి ఇంకా ఫైనల్ కాలేదని మెగా ఫ్యామిలీ మళ్లీ ఆలోచనలో పడిందనే వార్తలు రావడంతో.. ఇప్పుడు సడెన్ గా ఓ ప్రెస్ రిలీజ్ వచ్చింది. దీని ప్రకారం వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా రానుందన్న మాట ఖాయమే.

ఈ చిత్రానికి 'మిస్టర్' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసేశారట. మే 15 నుంచి స్పెయిన్ లో షూటింగ్ స్టార్ట్ అవుతుందని డీటైల్స్ కూడా ఇచ్చారు. అంతే కాదు.. మిస్టర్ లో వరుణ్ తేజ్ కి జంటగా లావణ్య త్రిపాఠి - హేభా పటేల్ లను హీరోయిన్లుగా తీసుకున్నట్లు వెల్లడించారు. అంతా బాగానే ఉంది కానీ.. ఈ ప్రెస్ నోట్ అయినా నమ్మాలా వద్దా అనే కన్ఫ్యూజన్ మాత్రం కంటిన్యూ అవుతోంది. గతంలో కూడా మార్చ్ 8న సినిమా షూటింగ్ స్టార్ట్ అంటూ ఇలాగే ఓ ప్రెస్ నోట్ ఇచ్చారు. ఆ డేట్ వెళ్లిపోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఇప్పుడు రూమర్స్ కు సమాధానం చెప్పడం కోసం మరో ప్రెస్ నోట్ వచ్చింది.

ఇందులో అడిషనల్ గా వివరం ఏంటంటే సినిమా పేరు కన్ఫాం చేయడం స్పెయిన్ లో షూటింగ్ అనడం మాత్రమే. మరి ఈ డేట్ అయినా ఖాయమేనా కాదా అనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలనయినా నమ్మాలంటే మే 15న స్పెయిన్ నుంచి వచ్చే అప్ డేట్స్ కోసం ఎదురుచూడాల్సిందే.

,  ,  ,  ,  ,