Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Aug-2015 15:56:03
facebook Twitter Googleplus
Photo

కింగ్ నాగార్జున కార్తీ కథానాయకులుగా వంశీ పైడిపల్లి ఓ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తమన్నా ఈ చిత్రంలో కథానాయిక. ఇన్ టచబుల్స్ అనే హాలీవుడ్ చిత్రం ఇన్ స్పిరేషన్తో తెరకెక్కుతున్న రీమేక్ చిత్రమిది. ప్రస్తుతం టీమ్ ఆన్ సెట్స్ బిజీగా ఉంది. ఫ్రాన్స్లో నాగార్జున కార్తీ తమన్నాలపై కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. అయితే లేటెస్టు అప్ డేట్ ప్రకారం కింగ్ సినిమాలో ఓ ఇంటర్నేషనల్ మోడల్ నటించనుంది. పేరు గాబ్రియేలా డెమిట్రియాడ్స్.

ఈ భామ ఇప్పటికే మిస్ ఐపీఎల్ బాలీవుడ్ 2009గా ఎంపికైంది. దక్షిణాఫ్రికా స్వస్థలం. అక్కడ మోడల్ గా రాణించింది. ఇప్పుడు అనూహ్యంగా నాగార్జున కార్తీ మల్టీస్టారర్ లో అవకాశం అందుకుంది. ప్రస్తుతం ఫ్రాన్స్ లో యూనిట్ తో కలిసి తన రోల్ లో నటించడానికి రెడీ అవుతోంది. గాబ్రియేలా రోల్ సినిమాలో అత్యంత కీలకం. తమన్నాతో రైవల్రీ నడిపించే విదేశీ మోడల్ గా నటించనుంది. కార్తీకి తమన్నాకి గాబ్రియేలాకి మధ్య ఆసక్తి రేకెత్తించే సన్నివేశాలు నడుస్తాయని చెబుతున్నారు. ఇంతవరకూ విదేశీ మోడల్స్ ఐటెమ్ భామలుగానే కనిపించారు. ఇప్పుడు ఏకంగా తెలుగు సినిమాల్లో కీరోల్స్ పోషించేస్తున్నారు. ఎమీజాక్సన్ తర్వాత ఈ భామ కూడా స్టార్ల సరసన నటించేస్తోంది.

,  ,  ,