Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Oct-2016 12:53:07
facebook Twitter Googleplus
Photo

గౌతమీపుత్ర శాతకర్ణి సందడి షురూ కాబోతోంది. ఫస్ట్ లుక్ - టీజర్ విడుదలకి రంగం సిద్ధమైంది. బాలయ్య పండితులతో మాట్లాడి ప్రత్యేకంగా ముహూర్తం ఫిక్స్ చేశారు. విజయదశమిని పురస్కరించుకొని అక్టోబరు 9న రాయల్ లుక్ నీ - అక్టోబరు 11 ఉదయం 8 గంటలకి టీజర్ ని విడుదల చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ఓ ప్రకటన విడుదల కాబోతోంది. బాలకృష్ణ ఏం చేసినా పంచాంగాన్ని అనుసరించే చేస్తుంటారు. ఆయన సినిమాల ప్రారంభం కానీ - ఫస్ట్ లుక్ లు - ఆడియో విడుదలలు - సినిమా విడుదలలు అన్నీ కూడా ముహూర్తం ప్రకారమే జరుగుతుంటాయి. తొలి షో ఎప్పుడు మొదలవ్వాలన్నది కూడా పంచాంగాన్నిబట్టే ఉంటుంది.

గౌతమీ పుత్ర శాతకర్ణి విషయంలోనూ అలాగే జరుగుతోంది. ఈసారి విడుదలయ్యే ఫస్ట్ లుక్ రాయల్ అవతారంలో ఉండబోతోందట. బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి అవతారంలో సింహాసనంపై నిలుచున్న లుక్ బయటికి రావొచ్చని అంచనా వేస్తున్నారు. బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉంది చిత్రబృందం. అందుకే శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు.

,  ,  ,  ,  ,  ,