Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-May-2016 12:15:27
facebook Twitter Googleplus
Photo

జల్సా.. గజిని.. మగధీర.. 100% లవ్.. కొత్త జంట.. పిల్లా నువ్వులేని జీవితం.. భలే భలే మగాడివోయ్.. సరైనోడు.. ఇదండీ ''గీతా ఆర్ట్స్'' వారి మోడ్రన్ కేటలాగ్. అన్నీ హిట్లే. అయితే వరుసగా ఇలా హిట్లు తీయడానికి అసలు వీరి చేతిలో ఉన్న ఆ సీక్రెట్ ఫార్ములా ఏంటంటారు? హిట్టు కథను నమ్ముకున్నారా లేకపోతే హిట్టు అని తెలిశాక ఆ కథలను వీరే కొనేశారా?

ఈ సినిమాల్లో.. ఎక్కువగా కథ తాలూకు కొత్తదనంతో మనల్ని ఆలరించిన సినిమాలు కేవలం గజిని అండ్ 100' లవ్ మాత్రమే. మిగిలినవన్నీ రొటీన్ చింతకాయ పచ్చడి కథలే. ఇక మగధీర ఒక్కటే విజువల్ వండర్. మిగిలివన్నీ మామూలు సినిమాలే. అయితే ఆ సమయానికి ఎవరి మార్కెట్ ఎలా ఉందో అంచనా వేసుకుని.. ఎవరికి ఏ కాంబినేషన్ సెట్ చేస్తే కరక్టు అనే విషయం చూసుకుని.. సరైన ప్రమోషన్లు.. సరైన ప్లానింగ్.. సరైన రిలీజ్ డేట్ కారణంగానే గీతా ఆర్ట్స్ సంస్థ ఎక్కువగా లాభపడింది. దీనికి కారణం మహా మేథావి అల్లు అరవింద్ తెలివితేటలే. విమర్శకులకు నచ్చని సరైనోడు సినిమాను కూడా 60 కోట్లు షేర్ వసూలు చేయించే దిశగా ప్రయాణం చేయించారంటే.. ఆయన తెలివే తెలివి.

ఇక కథలు కొట్టేయడం లేకపోతే కథలు వండించడం అనేది అసలు లాజిక్కే కాదు అంటున్నారు విశ్లేషకులు. ఇన్నేసి హిట్లు కొట్టారంటే దానికి కారణం మాష్టర్ ప్లానింగ్ మాత్రమేనట. అలా సాగుతోందండీ గీతా ఆర్ట్స్ కథ. గుడ్ లక్.

,  ,  ,  ,