Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Oct-2016 14:58:45
facebook Twitter Googleplus
Photo

పిల్లలతో గడపం అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండీ! వారు చేసే అల్లరి చేష్టలూ ముద్దుముద్దు మాటలకు తల్లిదండ్రులు మురిసిపోతూ ఉంటారు. పిల్లలు పుట్టిన తరువాత మగాడి జీవితంలో చాలా మార్పులు వస్తాయన్నది వాస్తవం. ప్రాధాన్యతలు మారిపోతాయి. బయట ఎన్ని టెన్షన్లు పడినా ఎంత పని ఒత్తిడికి లోనైనా ఇంటి తలుపు కొట్టగానే చిరునవ్వులతో పిల్లలు కనిపిస్తే... ఆ రిలాక్సేషన్ అనుభవించాల్సిందే! హీరో గోపీచంద్ ఇప్పుడు అలాంటి అనుభూతులకే లోనైతున్నానని చెబుతున్నాడు. నటుడు శ్రీకాంత్ మేనకోడలు రేష్మతో గోపీచంద్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు రెండేళ్ల కొడుకు ఉన్నాడు. గోపీచంద్ కుమారుడు పేరు విరాట్ కృష్ణ. తన ముద్దుల కొడుకు రెండో పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించాడు.

ఇంతకుముందు ఓసారి తన కొడుకు ముచ్చట్లను గోపీచంద్ పంచుకున్నాడు. విరాట్ పుట్టిన తరువాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని అన్నాడు. నా కుటుంబమే నన్ను నడిపించే శక్తిగా మారిందన్నాడు. విరాట్ తో స్పెండ్ చేయడం తనకు చాలాచాలా ఇష్టమని చెప్పాడు. విరాట్ చాలా చురుగ్గా ఉంటాడనీ వాడితో ఆడుతుంటే సమయం తెలీకుండా గడిచిపోతుందని గోపీచంద్ మురిసిపోతూ చెప్పాడు. ఇంటికి రాగానే విరాట్ కనిపిస్తే చాలు.. టెన్షన్లన్నీ మరచిపోతానని చెబుతున్నాడు. ఒక్కోసారి తన భార్య కూడా తనని ఆటపట్టిస్తూ ఉంటుందనీ తనకంటే వాడితోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నానని సరదాగా కంప్లయింట్ చేస్తూ ఉంటుందని గోపీచంద్ అంటున్నాడు. అయితే తనపై నాకు ప్రేమ తనకు తెలుసనీ ఆమె నా జీవితంలోకి రావడమే అదృష్టమని అన్నాడీ హీరో. ఎవరికైనా ఫ్యామిలీకి మించిన స్వర్గం ఉంటుందా..? పిల్లలకు మించిన సంతోషం ఉంటుందా చెప్పండీ!

,  ,  ,  ,  ,  ,