Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Jan-2017 10:56:39
facebook Twitter Googleplus
Photo

సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి... మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150... ఈ రెండూ పోటీపోటీగా బాక్సాఫీస్ ను కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరొ కొత్త రికార్డులను ఈ రెండు చిత్రాలు సాధించాయి. విడుదలైన అతి తక్కువ రోజుల్లోనే అమెరికాలో విడుదలైన తెలుగు చిత్రాల ఆల్ టైమ్ హిట్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో జనవరి 20 నాటికే ఖైదీ 2.282 మిలియన్ డాలర్లతో నాలుగో స్థానం దక్కించుకుంది. ఇక బాలయ్య శాతకర్ణి కూడా 21వ తేదీ నాటికి 1.5 మిలియన్ డాలర్లను రాబట్టి పదో స్థానంలో నిలిచింది. ఈ రెండు చిత్రాల కలెక్షన్లూ స్టడీ ఉన్నాయనీ ట్రేడ్ వర్గాలు అంటున్న నేపథ్యంలో ఆ స్థానాలు మరింత పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఇక అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 25 చిత్రాలేంటో చూద్దాం.

(కలెక్షన్ల వివరాలు మిలియన్ డాలర్లలో)

1. బాహుబలి - 8.46

2. శ్రీమంతుడు - 2.891 (కెనడా కలెక్షన్లతో సహా)

3. అ..ఆ.. - 2.445

4. ఖైదీ నం. 150 - 2.282 (జనవరి 20 వరకూ)

5. నాన్నకు ప్రేమతో - 2.022

6. అత్తారింటికి దారేది - 1.898

7. జనతా గ్యారేజ్ - 1.800

8. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - 1.635 (కెనడా కలెక్షన్లుతో సహా)

9. ఊపిరి -1.619

10. గౌతమీపుత్ర శాతకర్ణి - 1.5 (జనవరి 21 వరకూ)

11. దూకుడు - 1.563

12. మనం - 1.539

13. ఆగడు - 1.482

14. ధృవ - 1.47

15. భలేభలే మగాడివోయ్ - 1.430

16. రేసుగుర్రం - 1.395

17. వన్ నేనొక్కడినే - 1.330

18. బాద్ షా - 1.279

19. సన్నాఫ్ సత్యమూర్తి - 1.275

20. పెళ్లి చూపులు - 1.223

21. బ్రహ్మోత్సవం - 1.158

22. ఈగ - 1.071

23. సర్దార్ - 1.070

24. టెంపర్ - 1.053

25. గబ్బర్ సింగ్ - 1.034

,  ,  ,  ,  ,  ,