Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jan-2017 10:35:37
facebook Twitter Googleplus
Photo

సంక్రాంతి పండుగ కానుకగా విడుదలయిన బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలయ్యి వారం పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. చారిత్రక నేపథ్యం ఉన్న కథతో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో సందడిచేస్తూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. ప్రస్తుతం మొదటివారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.31.55 షేర్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ఓవర్ సీస్ లోనూ రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తోంది.

ఏరియాల వారీగా శాతకర్ణి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వివరాలు::

నైజాం - 7.31 కోట్లు

సీడెడ్ - 6.47 కోట్లు

నెల్లూరు - 1.50 కోట్లు

గుంటురు - 3.66 కోట్లు

కృష్ణా - 2.57 కోట్లు

వెస్ట్ గోదావరి - 3.06 కోట్లు

ఈస్ట్ గోదావరి - 3.02 కోట్లు

ఉత్తరాంధ్ర - 4.00 కోట్లు

మొత్తం ఏపీ - తెలంగాణల్లో శాతకర్ణి షేర్ రూ. 31.59 కోట్లు

---

కర్ణాటక - రూ. 3.50 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా - 0.50 కోట్లు

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా - 5.10 కోట్లు

రెస్ట్ ఆఫ్ వరల్డ్ - 1.00 కోట్లు

---

మొత్తం ప్రపంచ వ్యాప్తంగా మొదటి వారం శాతకర్ణి షేర్ రూ.41.69 కోట్లు

ఈ మొత్తం 41.69 కోట్ల షేర్ తో "గౌతమీపుత్ర శాతకర్ణి" బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇదే క్రమంలో టాలీవుడ్ ఆల్ టైం హయ్యెస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లో టాప్ 10లో స్థానం సంపాదించి 9వ ప్లేస్ లో నిలిచింది.

ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో బాహుబలి - ది బిగినింగ్ ఉండగా... తర్వాత స్థానాల్లో వరుసగా ఖైదీ నంబరు - 150 - జనతా గ్యారేజ్ - శ్రీమంతుడు - అత్తారింటికి దారేది - సర్ధార్ గబ్బర్ సింగ్ - నాన్నకు ప్రేమతో - సరైనోడు చిత్రాలు ఉన్నాయి.

,  ,  ,  ,  ,