'లగాన్' సినిమాలో అమీర్ సరసన కథానాయికగా నటించిన అమ్మాయి గుర్తుందా? అదే, 'సంతోషం' సినిమాలో నాగార్జున పక్కన, 'తప్పు చేసి పప్పుకూడు'లో మోహన్ బాబు సరసన నటించిన బాలీవుడ్ నటి గ్రేసీసింగ్ ఇప్పుడు క్యారెక్టర్ పాత్రలు పోషిస్తోంది. ఇప్పుడీ అమ్మడు మహేష్ బాబుకి తల్లిగా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలో గ్రేసీ అమ్మ క్యారెక్టర్ పోషించడానికి అంగీకరించినట్టు తాజా సమాచారం. ఇందులో మహేష్ తల్లి పాత్ర చాలా కీలకమైనది కావడంతో ఆమెను ఎంపిక చేశారట. ఈ చిత్రం కోసం 'శ్రీమంతుడు' అనే టైటిల్ పరిశీలనలో వున్న సంగతి విదితమే!
maheshbabu, koratalashiva, srimanthudu, gracysingh,