Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Feb-2016 16:04:50
facebook Twitter Googleplus
Photo

సాయి కొర్రపాటి ఈ మధ్య నిర్మాతగా జోరు తగ్గించేశాడు. ?తుంగభద్ర? తర్వాత సినిమా మొదలుపెట్టడానికే చాలా టైం తీసుకున్నాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టి సైలెంటుగా షూటింగ్ కానిస్తున్నాడు. ఐతే నిర్మాతగా జోరు తగ్గించేసినా.. డిస్ట్రిబ్యూటర్ గా మాత్రం ఆయన యమ స్పీడు మీదున్నారు. చిన్న సినిమాల్ని హోల్ సేల్ గా కొని రిలీజ్ చేస్తూ తన అభిరుచిని చాటుకుంటున్నాడు. ఆయన అలా కొన్న సినిమాలు మంచి విజయం సాధిస్తుండటంతో సాయిది లక్కీ హ్యాండ్ అని.. ఆయనకు మంచి జడ్జిమెంట్ ఉందని మంచి పేరొచ్చింది.

ఇంతకుమందు రాజు గారి గది - జత కలిసే సినిమాల్ని హోల్ సేల్ గా కొని తన చేతుల మీదుగా రిలీజ్ చేసిన సాయి.. ఇంకో చిన్న సినిమాపై మనసు పడ్డాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ?గుంటూరు టాకీస్?ను రెండు రాష్ట్రాల్లో సాయి కొర్రపాటే రిలీజ్ చేయబోతున్నాడు. సినిమా తనకు బాగా నచ్చేయడంతో ఆయన రైట్స్ తీసుకున్నట్లు తెలిసింది. మొన్న బాలయ్య చేతుల మీదుగా రిలీజైన ట్రైలర్ సినిమా మీద బాగానే ఆసక్తి రేపింది. ఇక సాయి హ్యాండ్ కూడా పడిందంటే అంచనాలు మరింత పెరగడం ఖాయం. బహుశా బాలయ్య వచ్చి ట్రైలర్ రిలీజ్ చేయడానికి కూడా సాయినే కారణమేమో. బాలయ్యకు సాయి సన్నిహితుడన్న సంగతి తెలిసిందే. ఆయన విన్నపం మేరకే వచ్చి బాలయ్య ట్రైలర్ రిలీజ్ చేశాడేమో. ఏమైతేనేం ?గుంటూరు టాకీస్?కు మంచి సపోర్ట్ అయితే దొరికింది. మరి ఈ చిత్రం సాయికి హ్యాట్రిక్ అందిస్తుందేమో చూడాలి.

,  ,  ,  ,