Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Apr-2015 10:45:18
facebook Twitter Googleplus
Photo

నారా రోహిత్ సరసన హన్సిక తొలిసారిగా జతకట్టనుంది. 'మాన్ కరాటే' అనే తమిళ హిట్ సినిమాని నారా రోహిత్ త్వరలో రీమేక్ చేయనున్నాడు. దీనికి కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా, ఇందులో కథానాయికగా హన్సికను ఎంపిక చేస్తున్నట్టు తాజా సమాచారం. 'మాన్ కరాటే' ఒరిజినల్ లో తనే కథానాయికగా నటించింది. దాంతో, ఇప్పుడీ తెలుగు రీమేక్ లో కూడా ఛాన్స్ వచ్చినందుకు హ్యాపీగా వుందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

,  ,  ,  ,  ,