Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Oct-2017 12:54:39
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ అభిమానులను సంపూర్తిగా మెప్పించిన సినిమాల్లో గబ్బర్ సింగ్ పేరు ముందే ఉంటుంది. సల్మాన్ ఖాన్ హిట్ చిత్రం దబాంగ్ కు రీమేక్ అయినా కాన్సెప్ట్ తప్ప కథ తీరుతెన్నులు మాత్రం మార్చి అభిమానులను ఆసాంతం మెప్పించేలా సినిమా తీశాడు డైరెక్టర్ హరీష్ శంకర్. తాజాగా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తీసిన దువ్వాడ జగన్నాథమ్ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో నిరాశ ఎదుర్కొన్న హరీష్ శంకర్ మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.

పనన్ కళ్యాణ్ సినిమాల నుంచి తప్పుకుని రాజకీయాల్లో పూర్తిస్థాయిలో బిజీ అయిపోతాడని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా మినహాయించి కొత్తగా సినిమాలేవీ ఇంకా స్టార్ట్ చేయలేదు. మరికొన్ని కమిట్ మెంట్లు ఉన్నా అవెంతవరకు పట్టాలెక్కుతాయో తెలియదు. ఈలోగా ఎలాగైనా పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడానికి హరీష్ శంకర్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. కానీ ఇంతవరకు అతడికి పవన్ అపాయింట్మెంట్ అయితే లభించలేదు. హరీష్ సిద్ధం చేసిన స్టోరీ లైన్ చాలా బాగుందని.. పవన్ అది వింటే ఎస్ చెబుతాడని అతడి సన్నిహితులు అంటున్నారు.

పవన్ కళ్యాణ్ కు కూడా గబ్బర్ సింగ్ పాత్రపై ఎంతో అభిమానముంది. అందుకే పాత్రతో రెండో సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కూడా చేశారు. ఆ సినిమా చివర్లో రాజా సర్దార్ గబ్బర్ సింగ్ అనే టైటిల్ కూడా వేయించాడు. సర్దార్ ప్రమోషన్ల టైంలో మూడో పార్ట్ చేస్తారా అంటే చేస్తాననే చెప్పాడు.

,  ,  ,  ,  ,