Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jan-2017 12:06:18
facebook Twitter Googleplus
Photo

విప్లవ చిత్రాలతో పీపుల్ స్టార్ అని పిలిపించుకున్న ఆర్ నారాయణ మూర్తి.. ఈ సారి సంక్రాంతి రేస్ లోకి సడెన్ ఎంట్రీ ఇచ్చాడు. హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య అంటూ జనవరి 14న థియేటర్లలోకి వచ్చేస్తున్నాడీయన. పోటీ సంగతి పక్కన పెట్టి.. తన సినిమాపై.. అందులో ఉన్న కంటెంట్ పై నమ్మకంతో.. చిన్న సినిమాకి థియేటర్లు కేటాయించాలంటూ ప్రెస్ మీట్లు పెట్టి డిమాండ్ చేస్తూ.. విడుదల చేసేస్తుండడం విశేషం.

అసలు వ్యవస్థలో డబ్బు అనేదే లేకుండా చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ తీశామని చెబుతున్నారు మేకర్స్. ఆ సంగతి అలా ఉంచితే.. ఇప్పుడీ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య మూవీకి పోస్టర్లు పడుతున్నాయి. ఈ చిత్రంలో నారాయణ మూర్తికి జోడీగా జయసుధ నటిస్తున్న సంగతి తెలిసిందే. నారాయణమూర్తి- జయసుధల మధ్య రొమాంటిక్ సీన్ తో వేసిన పోస్టర్ ఆశ్చర్యం కలిగిస్తోంది. జయసుధ చీర కొంగు పట్టుకు లాగుతున్న మూర్తిగారు మనకు ఈ పోస్టర్ లో దర్శనం ఇస్తారు.

ఎంత కమర్షియల్ మూవీ అయినా.. నారాయణమూర్తి సినిమాల్లో ఇలాంటి సీన్స్ ఎవరూ ఆశించరు.. కనీసం ఊహించలేరు కూడా. పైగా అమ్మ.. అమ్మమ్మ కేరక్టర్లు వేస్తున్న జయసుధను.. ఇలా చూపించాలన్న ఆలోచన మరీ దారుణంగా ఉంది. పైగా ఓ పాటలో జయసుధ బుగ్గపై కొట్టాల్సిన సన్నివేశం చేయడానికి చాలా ఇబ్బంది పడిపోయానని నారాయణమూర్తి చెబుతుండడం మరీ ఆశ్చర్యకరం. ఇలాంటి ముదురు వయసు రొమాన్స్ చూడాలని ప్రేక్షకులు అనుకుంటారా? కంటెంట్ సరే వెంకట్రామయ్యా.. మరి ఈ పోస్టర్లేంటయ్యా?

,  ,  ,  ,  ,