Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Apr-2015 10:26:21
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ తెరపైకి రాకెట్ వేగంతో దూసుకు వచ్చిన కథానాయకుడిగా హృతిక్ రోషన్ కనిపిస్తాడు. తనకి సరిపోయే విభిన్నమైన పాత్రల రూపకల్పనపై ఆయన ఎక్కువగా దృష్టి పెట్టి, అనతికాలంలోనే అగ్రకథానాయకుల జాబితాలోకి చేరిపోయాడు. హృతిక్ ని తెరపై చూసిన వాళ్లంతా, హాలీవుడ్ కథానాయకుడికి కావలసిన లక్షణాలు ఆయనలో పుష్కలంగా ఉన్నాయని అనుకుంటూ వుంటారు. ఆయన హాలీవుడ్ సినిమా చేస్తే బాగుంటుందని కూడా భావిస్తుంటారు.

అందుకేనేమో హృతిక్ హాలీవుడ్ పై దృష్టి పెట్టాడు. హాలీవుడ్ కి సంబంధించి, వివిధరకాల కథలను ప్రస్తుతం ఆయన వింటున్నాడు. ఏదేవైనా ఈ ఏడాది హాలీవుడ్ సినిమా చేసితీరాలనే కసితో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా దర్శకుడి గురించిన విషయానికి వస్తే, 'ఫాస్ట్ అండ్ ప్యూరియస్' ను తెరకెక్కించిన 'రాబ్ కొహన్' పేరు ఎక్కువగా వినిపిస్తోంది. హృతిక్ కి కథ నచ్చితే .. రాబ్ కొహన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందనేది సమాచారం.

,  ,  ,  ,