Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Mar-2017 10:33:48
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు మూవీ కోసం ఓ పాట షూటింగ్ లోనే ఉన్నాడు. ఈ నెల చివరి వారంలో ఈ చిత్రం రిలీజ్ కానుండగా.. పవన్ ఈ మూవీ రిలీజ్ వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ప్రారంభించనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసేస్తున్నాడు మాటల మాంత్రికుడు.

ఈ మూవీ కోసం వేసిన ఓ భారీ సెట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. ఏకంగా 5 కోట్ల రూపాయలో సెట్టింగ్ వేసేశారు. రామోజీ ఫిలిం సిటీలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సెట్.. ఓ మాన్షన్ కు సంబంధించినది. టాలీవుడ్ లోనే భారీ ఖర్చుతో నిర్మాణం జరుపుకున్న సెట్స్ లో ఇది కూడా ఒకటిగా నిలవనుంది. సినిమాలో ఈ సెట్ కు చాలా కీలకమైన భాగం ఉంటుందట. మూవీలో ఎక్కువ భాగమే ఈ సెట్ లో షూటింగ్ చేయను్నారని తెలుస్తోంది. గతంలో పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీ కోసం ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఓ భారీ ఇంటి సెట్ వేశాడు.

అంతకు ముందు జల్సా మూవీ కోసం కూడా మరోసారి సెట్టింగ్ వేశారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న మూడో సినిమా కోసం మరింత భారీ సెట్ ని నిర్మించడం విశేషం

,  ,  ,  ,  ,  ,  ,  ,  ,