Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Dec-2014 17:39:27
facebook Twitter Googleplus
Photo

విక్రం హీరోగా శంకర్ రూపొందిస్తున్న భారీ చిత్రం 'ఐ' ఆఖరికి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకుంది. జనవరి 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఈ సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరాం ధ్రువీకరించాడు. "2015 జనవరి 9న 'ఐ' విడుదలవుతోంది. భారతీయ సినిమా చరిత్రలో అదొక రెడ్ లెటర్ డేగా నిలిచిపోతుంది" అంటూ శ్రీరాం ట్వీట్ చేశాడు. భారీ సీజీ వర్క్ తో కన్నుల పండువగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే, ఈ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా భారీ బిజినెస్ చేసిందని అంటున్నారు. తెలుగు ప్రదర్శన హక్కులను 40 కోట్లకు అమ్మినట్టు వార్తలొస్తున్నాయి.

,  ,  ,  ,  ,