Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-May-2016 17:06:57
facebook Twitter Googleplus
Photo

ఇండస్ట్రీ లో ఈ మద్య ఎక్కువగా గురూజీ అని పిలిచే దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మన మాటల మాంత్రికుడు త్రివిక్రమే. ఇక ఆయన శైలి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అసలు విషయంలోకి వెళితే సాధారణంగా మన మాటల మాంత్రికుడు ఎక్కువగా బయట కనిపించరు, ఇటీవల ఒక ప్రముఖ చానల్ కళాతపస్వి శ్రీ కే విశ్వనాథ్ గారి సినీప్రస్థానాన్ని వర్ణిస్తూ ?విశ్వనాదామృతంగా? ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు, ఆ కార్యక్రమంకి త్రివిక్రమ్ గారు ముఖ్య అతిధిగా విచ్చేశారు.విశ్వనాథ్ గారి గురించి ఆయన సినిమాల గురించి తనకున్న అనుభూతిని వ్యక్తపరుస్తూ ? మీరు ఇంకో సినిమా చెయ్యండి సార్?మీరు చేస్తాను అని చెప్పండి నేను నిర్మాత ఐపోతాను, నాకు మీతో పాటు పని చేసే అవకాశం ఇవ్వండి సార్? అని తనకున్న కోరికను బయటపెట్టాడు. నిజంగా ఇది జరిగితే ఎంత బావుంటుంది,జరగాలని ఆశిద్దాం.

,  ,  ,  ,  ,  ,