Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jun-2016 13:50:58
facebook Twitter Googleplus
Photo

చాలా రోజులుగా వెండితెరపై వెలగని గోవాభామ ఇలియాన తన మనస్సులోని మాట చెప్పుకొచ్చింది. 'దేవదాస్‌' సినిమాతో తెలుగు తెరపై ఆరంగేట్రం చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో అక్షయ్‌ కుమార్‌ సరసన 'రుస్తుం' చిత్రంలో నటిస్తోంది. అయితే.. ఇప్పటి వరకు తనకు వచ్చిన.. వస్తున్న ఆఫర్లలో చాలా వరకు ఇష్టం లేకుండానే నటిస్తున్నానని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.

తన నటన, అందం, అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ గోవా సుందరి అనతి కాలంలోనే టాప్ హీరోలతో నటించి అగ్ర కథానాయికగా చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 'బర్ఫీ' సినిమాతో బాలీవుడ్‌లోనూ మంచి నటిగా పేరు తెచ్చుకుంది. అక్కడ కూడా పలు సినిమాల్లో నటించింది. అయితే ఈ మధ్యకాలంలో తన అభిప్రాయాన్ని వెల్లడించింది. తన కోసం వచ్చే అవకాశాలు.. తనకిచ్చే అవకాశాలు ఏవీ తనకు నచ్చట్లేదని చెప్పేసింది. అలా అని సినిమాలేవీ ఒప్పుకోకుండా వెండితెరకు దూరమవడం మంచి నిర్ణయం కాదని తన ఆలోచనట. అందుకే ఇష్టమున్నా లేకున్నా సినిమాల్లో నటిస్తోందట. ఎక్స్ పోజింగ్, అదనపు ఆకర్షణగా ఉండే పాత్రలు చేయడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదట. దాన్ని బాగానే ఎంజాయ్ చేస్తారట. కానీ అలాంటివి కొన్ని మూవీస్ చేసిన తర్వాత తనకు ఆత్మసంతృప్తినిచ్చే సినిమాల్లో నటించాలని అనిపిస్తుందట. ఆ క్రమంలోనే అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న 'రుస్తుం' సినిమా అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇందులో నటించడం తనకు చాలా ఆనందాన్నిఇచ్చిందని చెప్పుకొచ్చింది.

,  ,  ,  ,  ,  ,