Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Apr-2016 12:03:56
facebook Twitter Googleplus
Photo

మనం ఇచ్చే ప్రతి కౌంటర్ కి ఓ మీనింగ్ ఉంటది చేసే ప్రతి ఎన్కౌంటర్ కి టైమింగ్ ఉంటుందిరా.. నిన్న రిలీజ్ చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ కొత్త ప్రోమోలో పవన్ పలికిన ఈ డైలాగ్ అభిమానుల నోట నానుతోంది. ట్రైలర్లో వినిపించిన డైలాగులు సైతం బాగానే ఆసక్తి రేపాయి. ఐతే సర్దార్ డైరెక్టర్ బాబీ.. అభిమానుల కోసం ఇంకో డైలాగ్ రివీల్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా సినిమాలో పవన్ పలికిన డైలాగుల్లో తనకు బాగా నచ్చింది ఏదో రివీల్ చేశాడు బాబీ. నిన్నా మొన్నా నాకనవసరం.. నేనొచ్చాక రూల్ మారాలి.. రూలింగ్ మారాలి.. టైం మారాలి టైం టేబుల్ మారాలి అంటూ విలన్ తో పవన్ చెప్పే డైలాగ్ తనకెంతో నచ్చిందని బాబీ చెప్పాడ

సర్దార్ ట్రైలర్ విషయంలో జనాలకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన మాట వాస్తవమే అని.. ఐతే ప్రేక్షకులు వేరే అంచనాలేమీ పెట్టుకోకూడదనే కథ ఏంటో ముందే రివీల్ చేశామని.. ఐతే సర్దార్ స్క్రీన్ ప్లే.. ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా నడిచే సినిమా అని.. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుల్ని వినోదంలో ముంచెత్తే విషయం సినిమాలో ఉందని బాబీ చెప్పాడు. సినిమాలో విజువల్ గ్రాండియర్ కనిపిస్తుందని.. దేశంలోని అనేక ప్రాంతాలు తిరిగి రిచ్ గా షూట్ చేశామని బాబీ వెల్లడించాడు. సినిమాలో మెజారిటీ పార్ట్ రతన్ పూర్ సెట్లో సాగుతుంది. ఆ సెట్టింగ్స్ అన్నీ భారీగా ఉంటాయి. రాజ కుటుంబానికి చెందిన హీరోయిన్ నేపథ్యాన్ని చూపించడానికి గుజరాత్ వెళ్లాం. విలన్ కు సంబంధించిన పోర్షన్ అంతా పుణెలో చేశాం. హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ చూపించడానికి కేరళ జలపాతాల దగ్గరికి వెళ్లాం. మొత్తంగా సినిమా అంతా విజువల్ గ్రాండియర్ కనిపిస్తుంది అని బాబీ చెప్పాడు.

,  ,  ,  ,  ,  ,  ,