పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తమ అభిమాన హీరోను ఎప్పుడెప్పుడు థియేటర్లలో ?సర్దార్ గబ్బర్ సింగ్? రూపంలో చూస్తామా? అని ఎదురుచూస్తున్న చూపులకు మరో ఐదు రోజుల్లోతెరపడనుంది. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 8న భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసింది. మూవీ టీమ్ ప్రచార కార్యక్రమాల్లో అప్పుడే నిమగ్మమైపోగా పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో ప్రమోషన్స్‌లో పాల్గొననున్నారు.
శరత్ మరార్తో కలిసి తాను కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమవ్వడంతో పవన్ ప్రమోషన్స్‌ను భారీ ఎత్తున చేపట్టాలని ప్లాన్ చేశారట. హిందీలో కూడా సినిమా ఒకేసారి విడుదలవుతుండడంతో అక్కడ కూడా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున నిర్వహించనున్నారట. సోషల్ మీడియా, ఈవెంట్స్, మీడియా మీట్స్‌తో టీమ్ రేపట్నుంచి సందడి చేయనుంది. పవన్ కళ్యాణ్ స్వయంగా కథ, స్ర్కీన్‌ప్లే అందించిన ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందన్న నమ్మకాన్ని దర్శకుడు బాబీ వ్యక్తం చేస్తున్నారు. పవన్ సరసన కాజల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించారు.