Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Dec-2014 14:23:23
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు సినిమాల్లో పరిచయ గీతాలు చాలా కొత్తగా ఉంటాయి. అభిమానులు కూడా వాటిని ఆస్వాదిస్తుంటారు. అలా 'ఒక్కడు'లో 'హరేరామ... ', 'పోకిరీ'లో 'జగడమే...', 'బిజినెస్ మాన్' లో 'ముంబయ్...' పాటలు చాలా పాప్యులర్ అయ్యాయి. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో మహేష్ పై అటువంటి ఓ పాటను ప్లాన్ చేశారు. ప్రస్తుతం బిజీగా జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్ కొత్త షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈరోజు ప్రారంభమైంది. మహేష్, కొంతమంది డాన్సర్లపై ఇంట్రడక్షన్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారని సమాచారం. గతంలోని పాటలకంటే ఈ పాట చాలా స్టయిలిష్ గా ఉంటుందట. మహేష్ కొత్తగా కనిపిస్తాడని, ఇది ఆయన కెరీర్ లోనే బెస్ట్ ఇంట్రో సాంగ్ అవుతుందని సినిమా యూనిట్ చెబుతోంది.

,  ,  ,  ,