Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Oct-2016 10:31:20
facebook Twitter Googleplus
Photo

ఈ మధ్యకాలంలో చాలా సినిమాలకు ఒకటే సర్టిఫికేట్ చేతిలో పెట్టేసి పంపించేస్తున్నారు సెన్సార్ బోర్డు వారు. మనోల్ళు కావాలనే ఇస్తున్నారా లేకపోతే ఎటువంటి కట్లు లేకుండా సినిమాను రిలీజ్ చేయాలంటే ఇదే స్టాండర్డ్ చేశారా అనే విషయం తెలియదు కాని.. మొన్నామధ్యన ప్రేమమ్ - ఈడు గోల్డ్ ఏహా - అభినేత్రి - జాగ్వార్ - మన ఊరి రామాయణం.. ఇలా అన్ని దసరా రిలీజులకూ యు/ఎ సర్టిఫికేట్ నే చేతిలో పెట్టారు.

ఇప్పుడిక మ్యాటర్లోకి వచ్చేస్తే.. అక్టోబర్ 21న రిలీజ్ కు సిద్దమవుతున్న పూరి జగన్ సినిమా ''ఇజం'' కూడా ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మామూలుగా పూరి సినిమాలంటేనే పంచ్ డైలాగులు ఓ రేంజులో ఉంటాయి. హీరోయిన్ల గ్లామర్ కూడా అదురుతుంది. అలాగే విలన్లతో ఫైట్లు కూడా కాస్త ఘాటుగానే ఉంటాయి. కాబట్టి మనోడికి ఈసారి ''A'' సర్టిఫికేట్ ఏమన్నా ఇస్తారేమో అనుకుంటే.. ఇక్కడ మాత్రం పూరి భయ్యాకు కూడా ''U/A'' చేతిలోపెట్టి పంపించేశారు. మొత్తానికి భయ్యా కూడా అదే సర్టిఫికేట్ తో బయటకు వచ్చానడమాట.

ఇకపోతే రొమాంటిక్ ట్రీట్ వంటి ఫస్టాఫ్.. అలాగే కాస్త హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్లతో కూడిన సెకండాఫ్ ''ఇజం'' సినిమాను ఒక మసాలా కమర్షియల్ సినిమాగా మార్చేశాయంట. అది సంగతి.

,  ,  ,  ,  ,  ,  ,  ,