Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Jul-2017 11:52:16
facebook Twitter Googleplus
Photo

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న జై లవకుశ టీజర్ లోని కొన్ని సన్నివేశాలు ఆన్ లైన్ లో లీకైన సంగతి తెలిసిందే. అదే తరహాలో తాజాగా జైలవకుశ సినిమాలోని ఇంట్రడక్షన్ సాంగ్ లీకైనట్లు తెలుస్తోంది. ఆ సాంగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నట్లు కొన్ని ఇంగ్లిష్ వెబ్సైట్లలో వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా ఈ ఘటనపై చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు.

గతంలో టీజర్ సన్నివేశాల లీక్ కు కారణమైన గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జై లవకుశ సినిమాలోని ఇంట్రడక్షన్ సాంగ్ లీకైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆన్ లైన్ లో ఆ వీడియో వైరల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పోషిస్తున్న మూడు పాత్రల్లోని జై పాత్ర కోసం ఈ పాటను కంపోజ్ చేసినట్టు తెలుస్తోంది.

జై లవకుశ టీజర్ కు విపరీతమైన క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ టీజర్ కు 24 గంటల్లోనే 7.5 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. 3 విభిన్న పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎలా నటించనున్నాడన్న ఆసక్తి తెలుగు సినీ ప్రేక్షకులలో నెలకొంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న జై లవ కుశ లో జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా రాశీ ఖన్నా నివేదా థామస్ నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,