Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Sep-2017 12:07:15
facebook Twitter Googleplus
Photo

వెండితెరపై తొలిసారి త్రిపాత్రిభినయంతో ప్రేక్షకులకు - అభిమానులకు పండగ చేయడానికి ఎన్టీఆర్ రెడీ అయ్యాడు. సినిమా ఆడియో కూడా రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చిన ఈ పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఆడియో రిలీజ్ ఫంక్షన్ సింపుల్ గా చేసినా పదోతేదీన ఫ్యాన్స్ మీట్ గ్రాండ్ గా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈనెల 21న జైలవకుశ థియేటర్లకు వస్తుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే డైరెక్టర్ బాబీ ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి చేయలేదని ఇండస్ట్రీలో ఓ టాక్ వచ్చింది. దీనికితోడు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా పెండింగ్ ఉందనే మాట వినిపించింది. సహజంగానే ఈ మాట అభిమానుల్లో కలవరం కలిగించింది. ఇప్పుడు ఆదరాబాదరాగా వర్క్ కంప్లీట్ చేస్తే సినిమాలో క్వాలిటీ తగ్గుతుందేమోనని డౌట్ పడ్డారు. ఈమధ్య కాలంలో అలా ఆదరబాదరాగా షూట్ చేసిన సినిమాలకు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే జైలవకుశ సినిమాకు సంబంధించి ఒక పాట తప్ప మిగతా షూటింగ్ మొత్తం పూర్తయిందని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలావరకు కంప్లీట్ అయిపోయిందని యూనిట్ టీంలోని వారు చెబుతున్నారు.

రాశీఖన్నా - నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న జైలవకుశపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికితోడు ఎన్టీఆర్ చేస్తున్న నెగిటివ్ రోల్ రావణ సినిమాకు స్పెషల్ అస్సెట్ గా నిలుస్తుందని టీజర్ లోనే తెలిసిపోయింది. మిగిలిన సాంగ్ తోపాటు మొత్తం పనులన్నీ పూర్తి చేసి వారంలో సెన్సార్ ముందుకు వెళ్లడానికి డైరెక్టర్ - ప్రొడ్యూసర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

,  ,  ,  ,