Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Sep-2015 17:28:22
facebook Twitter Googleplus
Photo

తెలుగు చిత్ర పరిశ్రమ బాక్సాఫీస్ పరంగా ఇప్పుడు ఒకట్రెండు స్థానాలలో ఉన్న సినిమాలు ఒకటి రాజమౌళిది అయితే రెండోది మహేష్ ది. విజయాల పరంగానే కాదు పరిశ్రమలో ఇతరుల పనితీరు ప్రశంసించడంలో కూడా ఇద్దరూ ఇద్దరే. ఎంత బిజీగా ఉన్నా కానీ రాజమౌళి విడుదలైన చాలా సినిమాలని కవర్ చేస్తాడు. కాస్త పెరున్న ప్రతి సినిమాని విడుదలైన రోజు ఉదయాన్నే చూసేస్తాడు. అసలు ట్రెండ్ ఎలా ఉన్నది. ప్రేక్షకులు ఎటువంటి సినిమాలని ఆదరిస్తున్నారు అనేది స్టడీ చేస్తాడు.

తనకు నచ్చిన సినిమాలని ప్రశంసించి వాటికి తనవంతు సహకారం అందిస్తుంటాడు. మహేష్ థియేటర్లకి వెళ్ళినా వెళ్లకపోయినా కానీ బాగున్నా సినిమాలని స్పెషల్ షో వేయించుకొని మరీ చూస్తాడు. అలాగే కొత్తగా వచ్చిన సినిమాల్లో ఏదైనా తనకు నచ్చిన అంశం ఉంటె వెంటనే దాని గురించి ట్విట్ చేస్తాడు. కంచే ట్రైలర్ చూసి ముచ్చటపడిన మహేష్ మొదట క్రిష్ కి కాల్ చేసి అభినందనలు తెలిపాదట. ఆ తర్వాత ట్విట్టర్లో కంచెను మెచ్చుకుంటూ ట్విట్ చేశాడు. ఓ చిన్న సినిమాని మహేష్ లాంటి సూపర్ స్టార్ నుంచి ప్రశంసలు దక్కితే ఇక దానికి అదనంగా కావాల్సిన పబ్లిసిటీ ఏముంటుంది చెప్పండి.

,  ,