Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-May-2016 17:43:16
facebook Twitter Googleplus
Photo

ఇటీవల మన కథానాయకులు కూడా తమిళ్ స్టార్స్ లాగా విజృంభిస్తున్నారు. రెండు మూడు భాషల్ని టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు. మార్కెట్ పెంచుకోవడమే దీని వెనక ప్రధాన లక్ష్యం. దాంతో తెలుగు ఇండస్ట్రీలో బై లింగ్వుల్ సినిమాల హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. ఈమధ్యే నాగార్జున ఊపిరి - మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలు తమిళంలోనూ విడుదలయ్యాయి. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటించే కొత్త సినిమా కూడా బై లింగ్వులే.

ఎన్టీఆర్ కూడా ఇప్పుడు తమిళ్ - మలయాళం ప్రేక్షకుల్ని టార్గెట్ చేశాడు. కొత్త చిత్రం జనతా గ్యారేజ్ ని తెలుగుతో పాటు తమిళ్ - మలయాళంలోనూ విడుదల చేయాలని నిర్ణయించాడు. ఇదొక యూనివర్సల్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో సినిమాని బహు భాషల్లో విడుదల చేస్తే బాగుంటుందనేది యూనిట్ నిర్ణయమట. ఆ మేరకు ముందు నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని రేపే ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నారు.

ఈ సందర్భంగా తెలిసిన విషయమేంటంటే జనతా గ్యారేజ్ అన్న పేరుతోనే తమిళం - మలయాళంలోనూ సినిమాని విడుదల చేయబోతున్నారట. పేరు మార్చే ఉద్దేశమేదీ చిత్రబృందానికి లేదట. జనతా గ్యారేజ్ అనే మాటే యూనివర్సల్ కాబట్టి అదే పేరునే కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారట. ఫస్ట్ లుక్ పోస్టర్లు మూడు భాషల్లోనూ విడుదల చేయాలని నిర్ణయించింది చిత్రబృందం. కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ సరసన సమంత నటిస్తోంది.

,  ,  ,  ,  ,