Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Sep-2016 13:34:28
facebook Twitter Googleplus
Photo

ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్ విజయవంతంగా నడుస్తూ రికార్డ్ కలెక్షన్లను కొల్లగొడుతోంది. రిలీజ్ డే రోజున మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తరువాత చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 75 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ చిత్రం మెగా సినిమాలైన ?మగధీర, అత్తారింటికి దారేది? లను దాటుకుని టాలీవుడ్ ఆల్ టైమ్ హిట్స్ లో మూడవ స్థానం దక్కించుకుంది.
ఇకపోతే ఈ వారాంతం కూడా సినిమాకి మంచి ఆదరణ దక్కింది. దాదాపు అన్ని మల్టీప్లెక్స్ థియేటర్లు 85 శాతం వరకూ నిండాయి. ఈ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే ఇంకొద్ది రోజుల్లో ఈ చిత్రం రెండవ స్థానంలో ఉన్న మహేష్ బాబు ?శ్రీమంతుడు?ని కూడా క్రాస్ చేసే అవకాశముంది. పైగా చివరి వారంలో వచ్చిన ?సిద్దార్థ, నిర్మలా కాన్వెంట్? వంటి చిత్రాలు కూడా అంతంతమాత్రంగానే ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చే అంశంగా మారింది. ఇకపోతే కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 125 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

,  ,  ,  ,  ,