Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Jul-2016 14:10:38
facebook Twitter Googleplus
Photo

అభిమానులు నిరాశకి గురవుతారని తెలిసినా... వారి అంచనాలకి తగ్గట్టుగా ఉత్తమ చిత్రాన్ని అందించాలనే ఒకే ఒక్క కారణంతోనే ?జనతా గ్యారేజ్‌? విడుదలని వాయిదా వేస్తున్నామన్నారు కొరటాల శివ. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రమిది. సమంత, నిత్య మేనన్‌ కథానాయికలు. మోహన్‌లాల్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌. మోహన్‌ (సీవీఎమ్‌) నిర్మిస్తున్నారు. వచ్చే నెల 12న చిత్రాన్ని విడుదల చేయాలని ముందుగా నిర్ణయించినప్పటికీ తాజాగా ఆ తేదీని సెప్టెంబరు 2కు మార్చారు. ఆ విషయాన్ని ప్రకటించేందుకు శుక్రవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకర్ల సమావేశం నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ ??నిర్మాణానంతర కార్యక్రమాలకి తగిన సమయం కేటాయించడం కోసమే ఈ నిర్ణయం తీసుకొన్నాం. సినిమా విడుదల మూడు వారాల పాటు ఆలస్యం అవుతున్నందుకు ఎన్టీఆర్‌ అభిమానులకి క్షమాపణ చెబుతున్నా. విస్తృతమైన పరిధి ఉన్న కథ ఇది. ఎన్టీఆర్‌ బాగా నటించారు. ఒక మంచి చిత్రానికి సాంకేతికంగా ఏ లోటు చేయకూడదనే కాస్త సమయం తీసుకొంటున్నాం. ఆలస్యమైనా ఒక మంచి చిత్రంతోనే ప్రేక్షకుల ముందుకొస్తామ??న్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ??సినిమాపై మొదట్నుంచీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటిదాకా విడుదలైన ప్రచార చిత్రాలతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. వాటన్నిటినీ అందుకొనేలా దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నార??న్నారు. సాయికుమార్‌, ఉన్ని ముకుందన్‌, అజయ్‌, జాన్‌, దేవయాని తదితరులు నటిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.

,  ,  ,  ,  ,  ,