Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Jul-2016 17:00:21
facebook Twitter Googleplus
Photo

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ?జనతా గ్యారెజ్? ప్రస్తుతం తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో ఒకటి. ఇప్పటికే పోస్టర్స్, టీజర్‌తో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ బిజినెస్ చేస్తూంటే, తాజాగా సాటిలైట్ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్ముడుపోవడం విశేషంగా చెప్పుకోవాలి. తెలుగులో ప్రముఖ టీవీ చానల్స్‌లో ఒకటైన మా టీవీ ?జనతా గ్యారెజ్? సాటిలైట్ హక్కులను సుమారు 12.5 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే సాటిలైట్ రైట్స్‌లో ఇదే బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
?మిర్చి?, ?శ్రీమంతుడు? సినిమాలతో దర్శకుడిగా తనదైన బ్రాండ్ సృష్టించుకున్న కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉంది. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా సమాంతంగా కొనసాగుతూనే ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగష్టు నెలాఖర్లో దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన ఆడియో విడుదల కానుంది. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్‍లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటించారు.

,  ,  ,  ,  ,  ,  ,